హోండా సీబీ300ఆర్ ధర ఎంతో తెలుసా..?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా..అతి త్వరలో భారత మార్కెట్లోకి హోండా సీబీ300ఆర్ బైక్‌ను తీసుకరాబోతుంది. ఇక దీని ధర రూ.2.5 లక్షల లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ బైక్ బుకింగ్ మొదలు అయ్యాయి. కేవలం రూ.5,000 ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చట.

ఈ బైక్‌‌ను తొలిసారిగా 2017 ఈఐసీఎంఏ మోటార్‌సైకిల్ ప్రదర్శనలో ఆవిష్కరించింది. నియో స్పోర్ట్స్ కేఫ్ పోర్ట్‌ఫోలియో కింద ఈ బైక్‌ను లాంచ్ చేసింది.

ఇక దీని ఫీచర్లు చూస్తే..

* సీబీ300ఆర్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్
* 286 సీసీ ఇంజిన్, లిక్విడ్ కూల్డ్
* సింగిల్ సిలిండర్, ఫోర్ వాల్వ్
* డీఓహెచ్‌సీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇవ్వన్నీ యూకే మార్కెట్‌లోకి వేరియంట్‌ ఫీచర్లు. అయితే ఇండియన్ వేరియంట్ ఫీచర్లు తెలియాల్సి ఉంది.