వినియోగదారులకు షాక్ ఇచ్చిన హ్యుందాయ్‌..

వినియోగదారులకు షాకింగ్ విషయాన్నీ తెలియజేసింది ప్రముఖ వాహన సంస్థ హ్యుందాయ్‌. హ్యుందాయ్‌ నుండి వచ్చిన హ్యాచ్‌బ్యాక్‌ గ్రాండ్‌ ఐ10 వినియోగదారులను ఎంతగా ఆకట్టుకుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా దీని ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్‌ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి 3 శాతం వరకు (రూ.14,250–రూ.22,500) పెంచనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం ఈ కారు ధరల శ్రేణి రూ.4.74 – 7.51 మధ్య ఉందని కంపెనీ సీఈఓ వైకే కూ తెలిపారు. అయితే మిగిలిన మోడ‌ల్ కార్ల ధ‌ర‌లేవీ పెర‌గ‌లేదు. మ‌రో వైపు ఈ ఏడాది దీపావ‌ళికి కొత్త కాంపాక్ట్ మోడ‌ల్‌ను తీసుకురానున్న త‌రుణంలో గ్రాండ్ ఐ10 ధ‌ర‌ను పెంచ‌డం జరిగినట్లు తెలుస్తుంది. ఈ పెంపుకు ప్రధాన కారణం ముడివస్తువుల ధరలు పెరగడం వల్లే అని సంస్థ చెపుతుంది. ఈ మోడల్‌ కారు మినహాయించి కంపెనీకి చెందిన ఇతర కార్ల ధరలు ఏవీ కూడా పెరగడం లేదని స్పష్టం చేసింది.

ఐ10 ఫీచర్స్ విషయానికి వస్తే

*1.2 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో లభిస్తోంది.
* ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్
* కొత్త అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఎయిర్ కర్టయిన్స్
* పూర్తి ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్
* వెనుకవైపునకు వ్యాపించేలా ఏసీ వంటివే కాకుండా మరెన్నో ఫీచర్లు కొత్త గ్రాండ్ ఐ10లో ఉన్నాయి.