మార్కెట్లోకి 1960 కాలం నాటి బైక్..

ప్రస్తుతం మార్కెట్లోకి సరికొత్త ఫీచర్స్ తో ఆకట్టుకునే బైక్స్ వస్తున్నాయి..ఈ నేపథ్యం లో 1960 లో ఓ ఊపు ఊపేసిన జావా బైక్‌ ..మళ్లీ మార్కెట్లోకి రాబోతుంది. 1960 లో యూరప్‌లో రూపుదిద్దుకొని.. క్రమంగా ప్రపంచమంతా విస్తరిస్తూ 60వ దశకంలో ఇండియా చేరుకుంది. ఐడియల్‌ జావా పేరుతో భారత్‌లో అడుగుపెట్టిన ఈ బైక్‌ అతి కొద్దీ రోజుల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. ఈ బైక్ ప్రత్యేకంగా రేసర్ల కోసమే తయారు చేయడం జరిగింది. 1980 వరకు ఈ బైక్స్ భారత్ లో బాగా అమ్ముడయ్యాయి. ఆ తర్వాత భారత మార్కెట్లోకి యమహా, హోండా సంస్థలు రావడం తో జావా(ఎజ్దీ) అమ్మకాలు పడిపోయాయి.

తాజాగా ఈ జావా బైకులను మళ్లీ తీసుకరాబోతుంది. అధునాతన మార్పులతో ముఖ్యంగా 300సీసీ ఇంజిన్‌ సామర్థ్యంతో మార్కెట్‌లోకి కొత్త జావా బైక్‌ అందుబాటులోకి తీసుకోస్తుంది. 2018 దీపావళిలోగా మార్కెట్‌లోకి కొత్త రకం జావా బ్రాండెడ్‌ బైక్‌ను తీసుకు రానున్నట్లు ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌ ద్వారా తెలిపారు. ప్రస్తుతానికి వీటి అభివృద్ధికి సంబంధించిన ప్రక్రియ మధ్యప్రదేశ్‌లోని పితాంపూర్‌లో కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. భారత్‌, ఆగ్నేయాసియా దేశాల్లో వీటి అమ్మకపు హక్కులు సైతం దక్కించుకున్నట్లు ఆయన చెప్పారు. మరి ఎంత కాలం తర్వాత రాబోతున్న జావా బైక్స్ ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.