మారుతీ నుండి సియాజ్‌ 2018 ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌..

వాహన ప్రియులకు తీపి కబురు తెలిపింది మారుతి సుజుకీ. తాజాగా తన సియాజ్‌ 2018 ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ఆగస్టు 20 న విడుదల చేస్తున్నట్లు తెలిపింది. దీని ధర రూ.7.8 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ సరికిత్త వెర్షన్‌ బుకింగ్స్‌ను రేపటి నుంచి ప్రారంభించబోతుంది.మొదట 11 వేల రూపాయలను కట్టి ఈ కొత్త సియాజ్‌ను బుక్‌ చేసుకోవచ్చు. 319 నెక్సా షోరూంలలో దీని బుకింగ్స్‌ను చేపడుతున్నామని మారుతీ సుజుకీ ప్రకటించింది.

ఇక ఈ వాహన ప్రత్యేకతలు చూస్తే..

* 5-స్పీడ్‌ మాన్యువల్‌, 4-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌
* ఎల్‌ఈడీ డేటైమ్‌ రన్నింగ్‌ లైట్స్‌తో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌
* కొత్త ఎల్‌ఈడీ రియర్‌ కాంబినేషన్‌ టైల్‌ల్యాంప్స్‌
* స్లీకర్‌ గ్రిల్‌, క్రోమ్‌ గార్నిషింగ్‌, అప్‌డేటెడ్‌ బంపర్‌, బ్రో షేప్‌ హెడ్‌లైట్స్‌తో కాస్త విభిన్నంగా కనిపిస్తుంది.
* ఇంజిన్‌ పరంగా మార్పులు బాగానే చేశారు. సియాజ్‌ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. * * గతంలో ఇది 1.4 లీటర్‌ ఇంజిన్‌గా ఉండేది. నూతన ఇంజిన్‌ 103 బీహెచ్‌పీ శక్తిని, 138 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది.
* వెనుక భాగంలో పెద్దగా మార్పులేవీ లేవు. అయితే ఇంటీరియర్స్‌లో కొత్తగా లైట్‌ కలర్డ్‌ ఫాక్స్‌ ఉడ్‌ ఇన్‌లేస్‌, * టచ్‌ స్ర్కీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో వంటి హంగులద్దారు.
* నెక్సా బ్లూ, మెటాలిక్‌ సిల్కీ సిల్వర్‌ కలర్స్‌తో పాటు మరికొన్ని వేరియంట్స్‌ ఉండవచ్చని అంచనా.