దశాబ్దకాలం తర్వాత నిస్సాన్ ఆ పనిచేయబోతుంది..

నిస్సాన్..ఈ పేరు చెపితే చాలు వాహన ప్రియులు ఎంతో ఇష్టపడతారు…ఇప్పటికే పలు మోడల్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చి ఆకట్టుకున్న నిస్సాన్..తాజాగా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన కిక్స్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది.

మొదటిసారి నిస్సాన్ ఈ కార్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దకాలం అవుతున్న ఇప్పటివరకు లగ్జరీ కార్ల వైపు చూడని ఈ సంస్థ మొదటిసారి ఈ లగ్జరీ కారును ప్రవేశపెట్టబోతున్నది. ఈ కారును వచ్చే జనవరిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు, అప్పుడే ధర, ఇతర వివరాలను వెల్లడించనున్నట్లు నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ థామస్ తెలిపారు.