భారత మార్కెట్లోకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ట్విన్స్‌ బైక్స్..

సరికొత్త మోడల్స్ అందిస్తూ మార్కెట్లో తన హవాను చూపించే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తాజాగా రెండు సరికొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటర్‌సెప్టర్‌ 650, కాంటినెంటల్‌ జీటీ 650లను తీసుకొచ్చింది. ఈ మధ్యనే ఈ రెండు బైకుల బుకింగ్స్ మొదలు అవ్వగా , నవంబర్ 14న అధికారికంగా లాంఛ్ కానున్నాయి. వీటి ధర వచ్చేసి రూ.2.5 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ రెండు బైకుల ప్రత్యేకతలు చూస్తే..

* అతిపెద్ద, శక్తివంతమైన ఇంజిన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ ప్రత్యేకత గా చెప్పుకోవచ్చు. 648 సీసీ ఇంజిన్, 47 హార్స్‌పవర్, 6-స్పీడ్ గేర్ బాక్స్, 25.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి.

* రెండు వీల్స్‌కు బ్రెంబో ట్విన్ పిస్టన్ కాలిపర్స్, 130 సెక్షన్ రియర్ టైర్, 36 స్పోక్ అలాయ్ రిమ్స్, స్లిప్పర్ క్లచ్ ఉండటం విశేషం. ఈ బైక్ బరువు 202 కిలోలు.

* ఇంటర్‌సెప్టర్ 650 ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13.7 లీటర్లు కాగా, కాంటినెంటల్ జీటీ 650 ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్లు.

* ఈ రెండు బైకుల టాప్ స్పీడ్ గంటకు 160 కిలోమీటర్లు. 50, 60 దశకాల నాటి మోటార్ సైకిళ్లను స్ఫూర్తిగా తీసుకొని కలర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది.

* రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్‌ స్టాండర్డ్, కస్టమ్, క్రోమ్ వర్షన్లల్లో ఈ బైకులు అందుబాటులో ఉన్నాయి.