ఎస్‌యూవీ ‘హ్యారియర్‌’ విడుదల..

ప్రముఖ వాహన సంస్థ టాటా మోటార్స్‌ తాజాగా ప్రీమియం ఎస్‌యూవీ ‘హ్యారియర్‌’ మొదటి కారు ను విడుదల చేసింది. ఈ కార్ ను 2019 తొలి అర్ధభాగంలో దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఈ కార్ ప్రత్యేకతల చూస్తే..

* ‘జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) సహకారంతో కేవలం ఆరు నెలల్లోనే ఈ ఎస్‌యూవీ రూపుదిద్దుకుంది.
* ఆప్టిమల్ మోడ్యూలర్ ఎఫీషియంట్ గ్లోబల్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్‍‌ను ఉపయోగించి హ్యారియర్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని నిర్మించారు.

* డ్యాష్‌బోర్డు, స్టీరింగ్ వీల్ మరియు ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏ మాత్రం గమనించడానికి వీల్లేకుండా పూర్తిగా కప్పేశారు.

* మోనోటోన్ లైటింగ్ గల ఇంస్ట్రుమెంట్ చాలా సింపుల్‌‌గా ఉంది. క్రోమ్ ఫినిషింగ్ గల స్పీడో మీటర్ మరియు ఆర్‌పిఎమ్ మీటర్లను గుర్తించవచ్చు.

* టాటా హ్యారియర్ ఇంటీరియర్‌లో మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ల్పే (MID) కలదు. ఇది, ఫ్యూయల్ లెవల్, మైలేజ్, ఓడో మీటర్, ట్రిప్ మీటర్ ఇంకా ఎన్నో వివరాలను చూపిస్తుంది.

* MID సిస్టమ్ యొక్క వివి ఫంక్షన్స్ యాక్సెస్ చేసుకునేందుకు మోడ్ అండ్ సెటప్ బటన్లు ఉన్నాయి.

* స్టీరింగ్ వీల్ చాలా కొత్తగా ఉండడం తో పాటు స్టీరింగ్ వీల్‌కు ఇరువైపులా పలు రకాల కంట్రోల్స్ ఉన్నాయి.

* స్టీరింగ్ వీల్‌కు ఎడమవైపున మ్యూజిక్, బ్లూటూత్, మరియు రిసీవ్ అండ్ ఎండ్ కాల్ బటన్స్ ఉన్నాయి.

* స్టీరింగ్ వీల్ మీద కుడివైపున క్రూయిజ్ కంట్లోల్ బటన్స్ ఉన్నాయి.

* హ్యారియర్ ఇంటీరియర్‌లో టియాగోలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ లైట్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. ఇలా అత్యధిక ప్రత్యేకతలు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది.