టాటా నుండి సరికొత్త కార్ రాబోతుంది..

లక్ష రూపాయలకే నానో కార్ అంటూ పదేళ్ల క్రితం హల్చల్ చేసిన టాటా..తాజాగా మరోసారి సరికొత్త హైబ్రిడ్ కాన్సెప్ట్ కార్ ను తీసుకరాబోతుంది. టాటా మెగాపిక్సెల్ అనే ఈ హైబ్రిడ్ కాన్సెప్ట్ కారును గత మార్చిలో జెనీవాలో జరిగిన 82వ అంతర్జాతీయ మోటార్ షోలో రతన్ టాటా ఆవిష్కరించారు. టాటా మెగాపిక్సెల్ ఇటు ఎలక్ట్రిక్ బ్యాటరీతో, అటు పెట్రోల్ ఇంజన్‌తో ఈ కార్ పనిచేస్తుందని సంస్థ తెలిపింది.

ఈ కార్ ప్రత్యేతలు చూస్తే..

* ఈ కార్ ను ప్రత్యేకంగా యూరోపియన్ మార్కెట్ల కోసం డిజైన్ చేయడం జరిగింది. ముందు యూరోపియన్
* మెరుగైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కారును నిర్ణయించింది.
* సాంకేతిక విభాగం పిక్సెల్ కాన్సెప్ట్‌ ఆధారంగా చేసుకొని మెగాపిక్సెల్ హైబ్రిడ్ కాన్సెప్ట్ కారు తయారు చేసింది.
* రేంజ్ ఎక్స్‌టెండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (రీవ్) కాన్సెప్ట్ ఆధారంగా ఈ ఫోర్-సీటర్ సిటీ స్మార్ట్ కారుని యూరప్‌లోని టాటా డిజైన్ విభాగం రూపొందించింది.
* టాటా మెగాపిక్సెల్ టర్నింగ్ రేడియస్ కేవలం 5.6 మీటర్లు మాత్రమే.
* దీని గరిష్ట వేగం గంటకు 100 కి.మీలు.
* మెగాపిక్సెల్ కారులో నాలుగు చక్రాలకు ఎలక్ట్రిక్ మోటార్లు (ప్రతి చక్రంలో ఒక మోటార్) ఉంటాయి.
* ఇవి 13 కిలోవాట్ల లిథియం అయాన్ ఫాస్పేట్ బ్యాటరీపై పనిచేస్తాయి.
* బ్యాటరీ పవర్ తో ఈ కారులో 54 మైళ్ల దూరం ప్రయాణించవచ్చు.
* ఇండక్షన్ ఛార్జింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి ఈ బ్యాటరీలను రీచార్జ్ చేసుకోవచ్చు.
* బ్యాటరీల్లో ఛార్జింగ్ అయిపోతే ఇందులో ఉండే చిన్నపాటి 30 బిహెచ్‌పి 325సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ వాడుకోవచ్చు.
* పెట్రోల్ ట్యాంక్‌ ఒక్కసారి ఫుల్ చేస్తే సుమారు 900 కి.మీ.లు వెళ్లవచ్చు.
* ఇది బ్యాటరీ పవర్‌తో కలిపి లీటరుకు వంద కిలోమీటర్ల మైలేజీనిస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది.