ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బాబు అవుట్..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతంగా 63 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది..వారం అంత ఎలాగున్నా శని, ఆది వారాలు మాత్రం ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తుంది. దీనికి ముఖ్య కారణం నాని. తనదయిన స్టయిల్ లో హోస్ట్ చేస్తూ , హౌస్ లో తప్పులు చేస్తున్న సబ్యులకు క్లాస్ లు తీసుకుంటూ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ ఇస్తున్నాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న బాబు గోగినేని, శ్యామల, తనీష్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు,గణేష్‌లలో ఇద్దరు సేఫ్ అయ్యారు. యాంకర్ శ్యామల, సింగర్ గీతా మాధురిలు ఈ వారం ఎలిమినేషన్‌ నుండి సేఫ్ అయినట్టు నాని తెలిపాడు.

ఇక మిగిలి ఉన్నముగ్గురిలలో బాబు గోగినేని ఈ వారం బ్యాగ్ సర్దేయాల్సిన టైం వచ్చినట్లు నమోదయిన ఓట్ల ద్వారా తెలుస్తుంది. మొదటి ప్లేస్ లో శ్యామల, గీత ఉండగా వారు సేఫ్ అయ్యారు. ఆ తర్వాత తనీష్ , దీప్తి , గణేష్ లు ఉన్నారు. చివరిగా బాబు గోగినేని ఉండడం తో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లే సభ్యుడు బాబునే అని తెలుస్తుంది. మరి బాబు ను మాత్రమే బయటకు పంపిస్తారా..లేక మరో హౌస్ సభ్యుడిని కూడా బయటకు పంపిస్తారా అనేది ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో తెలుస్తుంది.