బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ ఆ హీరోనేనట..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయ్యిందో..సీజన్ 2 నాని హోస్ట్ అనగానే చాలామంది అనేక అనుమానాలు లేవనెత్తారు..కానీ వారి అనుమానాలన్నీ పటాపంచలు చేసాడు నాని. తనదయిన యాంకరింగ్ తో యావత్ ప్రేక్షకులను , హౌస్ సభ్యులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ సీజన్ పూర్తి అయ్యింది. మొత్తం 17 మంది సభ్యులతో షో మొదలై , నలుగురి తో ఎండ్ అయ్యింది. కౌశల్ టైటిల్ విన్నర్ గా గెలిచి ట్రోఫీ ని సొంతం చేసుకున్నాడు.

ఇది పక్కన పెడితే సీజన్ 2 పూర్తి అయ్యిందో లేదో అప్పుడే సీజన్ 3 గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. మొదటగా హోస్ట్ ఎవరా అనేది చర్చంచుకోవడం స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరిస్తాడని అంత మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఎప్పుడూ ఒకరే హోస్ట్ గా ఉండటం కన్నా సీజన్ కొకరు మారుతుంటే షో కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా నడుస్తుందనే అభిప్రాయంలో ఉన్నారు నిర్వాహకులు. సామజిక మాధ్యమాల్లో అనుకుంటున్నట్టు నెక్స్ట్ బిగ్ బాస్ కు హోస్ట్ గా విజయ్ దేవరకొండ ఉంటారా.. లేక వేరే ఎవరైనా ఉంటారా అనేది చూడాలి.