బిగ్ బాస్ : తనీష్ కు ఓ రేంజ్ లో క్లాస్ పీకిన నాని..

నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ సాగుతుంది..వారం అంత హౌస్ సభ్యులు చేసిన పనులపై శనివారం నాని రివ్యూ ఇవ్వడం తెలిసిందే. ఇక రాత్రి జరిగిన ఈ షో లో నాని తనీష్ కు ఓ రేంజ్ లో క్లాస్ పీకాడు. గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన పరిణామాలపై ఆరాతీశాడు. ఈ సందర్భంగా ఇంటిసభ్యుల ప్రవర్తనపై ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశాడు నాని.

ముఖ్యంగా తనీష్‌కు గట్టిగానే క్లాస్‌ తీసుకున్నాడు. టాస్క్‌లో దీప్తి సునయన కోసం తప్పుకోవడం ఏమిటని అడిగాడు. దీనికి తనీష్‌ కాలునొప్పితో అలా చేశానని, సునయన కోసం కాదని ఎదో చెప్పాలి అన్నట్లు చెప్పాడు. ఈయన చెప్పిందంతా అబద్దమని షో చూస్తున్న వారికీ అర్ధం అయ్యింది. అయితే తనీష్ మాటలకూ నాని కన్విన్స్‌ కాలేదు. ఇక ఏ టాస్క్‌లో పాల్గొని నువ్వు బెస్ట్‌ ప్లేయర్‌ ఎలా అయ్యావని ప్రశ్నించాడు.

కబడ్డీ టాస్క్‌, క్రైయింగ్‌ టాస్క్‌, బాక్స్‌ టాస్క్‌ల్లో పాల్గొనలేదు మరీ ఎలా బెస్ట్‌ పర్‌ఫార్మర్‌ అయ్యావు అని నిలదీశాడు. ఈ ప్రశ్నకు తనీష్‌, అతని మద్దతుదారులకు దిమ్మతిరిగింది. సమాధానం చెప్పడంలో తనీష్‌ తడబడ్డాడు. ఇక కౌశల్‌ కాయిన్స్‌ తీసుకెళ్లడం వ్యతిరేకించిన తనీష్‌ పూజా విసిరిన కాయిన్స్‌ ఎలా తీసుకుంటావని ప్రశ్నించాడు. దానికి తనీష్ ఏదో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నాని ఇలాగే ఉంటె కష్టం అన్నట్లు చెప్పి వేరే హౌస్ మెంట్ దగ్గరికి వెళ్ళాడు.