తనీష్ ను బయటకు పంపేందుకు కౌశల్ ఆర్మీ భారీ స్కెచ్..?

నాని హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతం గా 58 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ హౌస్ లో మొదటి నుండి టీవీ & వెండి తెర నటుడు కౌశల్ తన మైండ్ గేమ్ తో ఆడుతున్న సంగతి తెలిసిందే. మిగతా హౌస్ సభ్యులంతా ఒకటి , కౌశల్ మాత్రం ఒకటి అన్నట్లు ఉంటూ వస్తున్నాడు. ఈ షో ద్వారా ఈయనకు భారీ ఫ్యాన్స్ అయ్యారు.

అంత కాదు సోషల్ మీడియా లో ప్రత్యేకంగా కౌశల్ ఆర్మీ పేరుతో ఓ పెద్ద నెట్ వర్కే నడుస్తుంది. వీరంతా కౌశల్ కోసం విపరీతమైన ఓట్లు వేస్తూ ఎలిమేషన్ నుండి తప్పిస్తూ వస్తున్నారు. ఇక ఈ వారం కౌశల్ ఎలిమేషన్ నామినేషన్ లో లేకపోయేసరికి వీరంతా తనీష్ ను బయటకు పంపేంచేందుకు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.

బిగ్ బాస్ షో మొదటి నుండి కూడా కౌశల్ ను బాబు గోగినేని , తనీష్ లు ముప్పుతిప్పలు పెడుతూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నామినేషన్ లోకి వీరిద్దరూ రావడంతో ఎలాగైనా వీరిలో ఒక్కరిని ఇంటి నుండి బయటకు పంపాలని కౌశల్ ఆర్మీ సమాయత్తమైంది. బలమైన ఈ ఇద్దరిలోంచి ఒకరిని ఇంటికి పంపించేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఇతర కంటెస్టెంట్లకు భారీగా ఓట్లు వేస్తున్నట్టు సమాచారం.

కౌశల్ కు వ్యతిరేక వర్గం మాత్రం బాబు – తనీష్ ఇద్దరినీ కాపాడుకోవడానికి క్యాంపెయిన్ చేస్తోంది. ఇద్దరికీ సమానంగా ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నారు. మరి ఈ వారం ఎవరు ఇంటి నుండి బయటకు వెళ్తారో చూడాలి.