ఏపీ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు..

ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శుక్రవారం (జులై 6) రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేసారు. ఏపీ సచివాలయంలోని తన చాంబర్‌లో ఈ ఫలితాలను విడుదల చేసి మీడియా కు తెలియజేసారు.

ఫలితాల్లో మొత్తం 52.42 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. జూన్ 11 నుంచి 25 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మొత్తం ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 35,140 మంది పరీక్షకు హాజరు కాగా, 18,424 ఉత్తీర్ణత సాధించారు. 16,707 మంది బాలికలు పరీక్షకు హాజరవగా 8745 మంది పాసయ్యారు. గత సంవత్సరం కంటే 18 శాతం తక్కువగా ఫలితాలు వచ్చాయిని తెలిపారు.