బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు..

ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బ‌రోడా లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 913 పోస్టులకు గాను దరఖాస్తులను కోరుతూ ప్రకటన చేసింది. అభ్యర్థులు రూ.600 దరఖాస్తు ఫీజుగా చెల్లించి.. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంట‌ర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు తుది ఎంపిక చేస్తారు. డిసెంబరు 26 వరకు దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తులు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది.

పోస్టుల వివరాల్లోకి వెళ్తే

* లీగ‌ల్ 60
* వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ (సేల్) 850
* వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ (ఆప‌రేష‌న్స్) 03

మొత్తం ఖాళీలు 913

అర్హతల విషయానికి వస్తే..

* బ్యాచిల‌ర్స్ డిగ్రీ (లా) ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.

* వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ (సేల్స్) డిగ్రీతోపాటు రెండేళ్ల పీజీ డిగ్రీ/ డిప్లొమా (మార్కెటింగ్/ సేల్స్‌/ రిటైల్ ) ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.

* వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ (ఆప‌రేష‌న్స్) రెండేళ్ల‌ పీజీ డిగ్రీ/ డిప్లొమా (మార్కెటింగ్/ సేల్స్‌/ రిటైల్/ ఫైనాన్స్) ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.