తీపి కబురు..టీఎస్‌పీఎస్సీ రెండు నోటిఫికేషన్లు

ఇప్పటికే పలు నోటిఫికేషన్లను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) తాజాగా జులై 19 న మరో రెండు నోటిఫికేషన్లను విడుదల చేయబోతుంది. జీహెచ్‌ఎంసీలో 124 బిల్‌కలెక్టర్ పోస్టులు, బేవరేజెస్ కార్పొరేషన్‌లో 78 ఖాళీలను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఈ పోస్టుల వివరాల్లోకి వెళ్తే..

* బేవరేజెస్ కార్పొరేషన్‌లోని ఖాళీల్లో 56 అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2
* 13 అసిస్టెంట్ ఆఫీసర్ గ్రేడ్ -2
* 9 డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అలాగే డీఈవోలకు ఎస్‌ఏ అభ్యర్థుల వెరిఫికేషన్ జాబితా పూర్తీ అయ్యినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. టీచర్ కొలువుల భర్తీలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.