త్వరలో తెలంగాణ లో పంచాయతీ కార్యదర్శుల నియామకాలు..

తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. ప్రభుత్వం ఫై ఎంతో నమ్మకంతో తెలంగాణ ప్రజలు మరోసారి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడంతో వారిని రుణాన్ని తీర్చుకునేందుకు కేసీఆర్ తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్తానని చెపుతున్నారు. అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 9,355 పంచాయతీ కార్యదర్శుల నియామకాలను చేపట్టనున్నట్లు తెలియజేసారు.

ఇందుకు అనుగుణంగా జిల్లాల వారీగా ఎంపికకు పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేస్తోంది. అక్టోబర్ నెలలో నిర్వహించిన రాత పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపికలు జరగనున్నాయి. క్లస్టర్ల వారీగా కాకుండా పంచాయతీ వారీగా కార్యదర్శులను నియమించాలని ప్రభుత్వం ఆగష్టు నెలలో నిర్ణయించింది. జూనియర్ పంచాయతీ పోస్టులు 6,603.. అప్పటికే ఖాళీగా ఉన్న 2,752 పోస్టులతో కలిపి మొత్తం 9,335 పోస్టులకు అక్టోబర్ 10న రాత పరీక్షలను నిర్వహించారు. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ జిల్లాల వారీగా ఎంపికకు కసరత్తు మొదలుపెట్టింది.