వీఆర్వో ‘కీ’ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబరు 16నవీఆర్వో పోస్టుల భర్తీకి సంబందించిన రాతపరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. 700 వీఆర్వో పోస్టులకుగాను రాష్ట్రవ్యాప్తంగా 10.58 లక్షల మంది దరఖాస్తుచేసుకున్న సంగతి విదితమే. ఈ పరీక్షలకు సంబందించిన ‘కీ’ పేపర్ ని టీఎస్‌పీఎస్సీ అధికారులు విడుదల చేశారు. శనివారమే కీ విడుదల చేసినప్పటికీ.. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆదివారం (సెప్టెంబరు 23) అందుబాటులో పెట్టారు.

ప్రాథమిక ‘కీ’ విడుదల చేసిన అనంతరం.. ‘కీ’పై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే సెప్టెంబరు 24 నుంచి 30 వరకు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. 30 తర్వాత తెలిపే అభ్యంతాలను పరిగణించబడదని చెప్పుకొచ్చారు. ఇక కీ కోసం ఎక్కడ క్లిక్ చెయ్యండి..