బెల్ట్ షాపులపై జ’గన్’..

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిని అమలు దిశగా తొలి అడుగు వేశారు.

ఇందులో భాగంగా ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంకే మీనా బెల్ట్ షాపులపై కొరడా ఝులిపించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అమరావతిలో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమైన మీనా బెల్ట్ సాపుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ షాపుల నియంత్రణ చర్యలపై ప్రతీరోజూ స్టేషన్ల వారీగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.

గ్రామానికొక కానిస్టేబుల్, మండలానికి ఒక ఎక్సైజ్ ఎస్సై లను బాధ్యులుగా చేస్తూ బెల్ట్ షాపుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. బెల్ట్ షాపుల నియంత్రణలో చక్కటి పనితీరు కనబరచిన సిబ్బందికి రివార్డులు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.