నిరుద్యోగ భృతికి మంగళం పాడారా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతికి మంగళం పాడారా అనే మాటలు మాట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ. 1000ల భృతి కల్పించింది. సార్వత్రిక ఎన్నికల ముందే నిరుద్యోగ భృతిని రూ.2000లు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఎన్నికల్లో గెలవడం కోసం కూడా కావొచ్చు. జగన్ ముఖ్యమంత్రి అయినా క్రమం లో జూన్ నెలలో పడాల్సిన నిరుద్యోగ భృతి విడుదల కాలేదు.

మరోపక్క నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌ మూతపడింది. రేషన్‌ షాపుల్లోని ఈ పోస్‌ మిషన్లలో వేలిముద్రలు వేసిన 24 గంటల వ్యవధిలోనే నిరుద్యోగ యువత ఖాతాలోకి సొమ్ము జమయ్యేది. జూన్‌ నెలలో మొదటి తారీఖులోనే అనేక మంది యువత వేలిముద్రలు వేశారు.అయినా ఇప్పటి వరకూ సొమ్ము జమ కాలేదు. దీనిపై సంబంధిత అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి సొమ్ములు విడుదల కావడం లేదని చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో భృతిపై సందిగ్ధత నెలకొంది. ఈ పథకం కొనసాగుతుందా? ఆగిపోతుందా? అనే అనుమానాలు నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.