భద్రాద్రి రాముడు ఆంధ్రుల దేవుడు

భద్రాద్రి రాముడు ఆంధ్రుల దేవుడు.. ఇప్పుడు ఈ మాట బయటకొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన క్రమంలో ముంపు ఏడు మండలాలను ఏపీలో కలిసాయి. ఆ టైం లో భద్రాచలం కూడా ఏపీ లో కలపాలంటూ పెద్ద యుద్ధమే జరిగింది. కానీ ఆలా జరగలేదు. కానీ ఇప్పుడు అది జరగబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

తాజాగా హైదరాబాద్ లో ఉన్న ఏపీ భవనాలు తెలంగాణ ఆధీనంలోకి వచ్చిన తరుణంలో భద్రాచలం అంశం కూడా జగన్, కేసీఆర్ , గవర్నర్ ల మధ్య జరిగిందని తెలుస్తుంది. భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు తెలంగాణ సీఎం సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.

ఒకవేళ భద్రాద్రి గ్రామాన్ని ఏపీలో కలిపితే ప్రజలు నుంచి ఆందోళనలు తలెత్తే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనా సున్నితమైన ఈ అంశాన్ని పరిష్కరించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కసరత్తు చేయవలసి ఉంటుంది.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.