కేటీఆర్ విషయంలో కేసీఆర్ తప్పు చేస్తున్నాడా..?

కేటీఆర్…ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తెలంగాణ రాష్ట్రం తెచ్చేందుకు కేసీఆర్ ఎంతటి కష్టాలు పడ్డాడో..ఆలా వచ్చిన రాష్ట్రానికి చెడ్డ పేరు రాకుండా అభివృద్ధి లోకి తీసుకెళ్లడంలో కేటీఆర్ ప్రధాన పాత్ర పోషించాడు. ఉడుకు రక్తంతో అందరిని పరుగులు పెట్టించాడు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంట్ కష్టాలు ఉంటాయని , ఇప్పుడు వస్తున్న 8 గంటల కరెంట్ కూడా రాదని , పరిశ్రమలు తరలిపోతాయని , కొత్త పరిశ్రమలు తెలంగాణకు రావని , నీటి కష్టాలు తీవ్రతరం అవుతాయని , గ్రామీణ , పట్టణ అభివృద్ధి జరగదని ఇలా ఒకటి రెండు ఏంటి జనాలను ఎంత భయ పెట్టాలో అంత భయ పెట్టారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమే అబ్బా అనుకునేలా తీర్చి దిద్దారు. ఆలా తీర్చి దిద్దడంలో కేటీఆర్ ప్రముఖ పాత్ర పోషించాడు.

తన శాఖ వరకే పనిచేయకుండా అన్ని శాఖల్లో పనిచేస్తూ , వారికీ సలహాలు , సూచనలు ఇస్తూ అభివృద్ధి వైపు సాగేలా పనిచేసాడు. తన మాట తీరు తో ప్రపంచ వాణిజ్య సంస్థలు తెలంగాణ లో పెట్టుబడి పెట్టె విధంగా , అలాగే కొత్త పరిశ్రమలు ఏర్పటు చేసే విధంగా వారికీ భద్రత కలిపించడం లో కేటీఆర్ ప్రధాన పాత్ర పోషించాడు. కేసీఆర్ మనశాంతిగా ఫామ్ హౌస్ లో ఉన్న సరే రాష్ట్రాన్ని ఎలా తీర్చి దిద్దాలో , ఎలాంటి పనులు చేయాలో , ప్రజలకు ఎలాంటి భద్రత కలిపించాలో, ఏయే ఏయే పథకాలు తీసుకురావాలో ఇలా అన్ని తానే చూసుకున్నాడు. ఐదేళ్లలో తెలంగాణ ఇంత అభివౄద్ది కావడం లో కేటీఆర్ పోషించిన పాత్ర మాటల్లో చెప్పలేం.

అలాంటి కేటీఆర్ ను తాజా మంత్రి వర్గంలో కేసీఆర్ తీసుకోకపోవడం చర్చ కు దారి తీసింది. ప్రధాన శాఖల్లో కేటీఆర్ ను తీసుకోకపోవడం రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఇబ్బంది గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కేసీఆర్ మనసులో ఏముందో చూడాలి.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.