కోడెల‌తో స్టార్ట్‌..

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడమే ఆలస్యం..వారి ధన దాహాన్ని చూపించారు. ఎవరికీ వారే అందినకాడికి దోచుకున్నారు. ఇసుక మాఫియా..భూకబ్జాలు ..రియల్ ఎస్టేట్..పధకాల పేరుతో ప్రజల డబ్బు ను దోచుకోవడం..లంచంలు..ఇలా ఒకటి రెండు ఏంటి ఎంతో కావాలో అంత దోచుకున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం మారింది..అప్పుడు కడుపు నింపుకున్న వారి లెక్కలు బయటకు కక్కించే పనిలో పడ్డాడు ముఖ్యమంత్రి జగన్. ముందుకు కోడెల కుటుంబం ఫై కన్నేశాడు.

సత్తెనపల్లి , నరసారావు పేట ఈ రెండింట్లో కోడెల బాధితులు ఉన్నట్లు స్వయంగా జగన్ తెలుసుకోవడం..దందాలా పేరుతొ కోడెల ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు పిర్యాదు లు రావడం తో ఆ కుటుంబం ఫై కేసు నమోదు చేసారు. ఎవరెవరు బాధితులు ఉన్నారో భయపడకుండా పిర్యాదు చేసుకోవచ్చని వైసీపీ పార్టీ నేత విజయసాయి తెలుపడం తో పిర్యాదు లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఈ ఫిర్యాదులను బట్టి తెలుగుదేశం నేతల ఆటలు కట్టించాలని చూస్తున్నారు. ఒక్కో నేతను బయటకు లాగుతూ తెలుగుదేశం పార్టీ ఉనికిని దెబ్బ తియ్యాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.