ఈ పెద్ద సినిమాల్లో ఏది పెద్ద విజయం సాధిస్తుందో..?

2019 సంక్రాతి కి సినీ అభిమానులకు పెద్ద పండగను తీసుకొస్తుంది టాలీవుడ్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు బరిలోకి రాబోతున్నాయి. ఈ మూడు కూడా దేనికి అదే జోనర్ లో రాబోతున్నాయి. జనవరి 9 న బాలకృష్ణ – క్రిష్ కలయికలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు విడుదల అవుతుంది. ఈ సినిమా ఫై యావత్ తెలుగు ప్రజానీకం ఎన్నో అంచనాలు పెట్టుకుంది. వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

జనవరి 11 న రామ్ చరణ్ – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ రిలీజ్ అవుతుంది. పూర్తి స్థాయిలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రంగస్థలం తర్వాత చరణ్ నుండి వస్తున్నా సినిమా కావడం తో మెగా అభిమానులు ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జనవరి 12 న కొత్త అల్లుళ్లు వెంకటేష్, వరుణ్ తేజ్ లు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ గా ఎఫ్ 2 తో వస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమా ఫై అంచనాలు పెంచేసింది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుంది. ఈ మూడు చిత్రాలతో పాటు రజనీ నటించిన పెట్టా కూడా రాబోతుందని అంటున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ చిత్రాల్లో ఏది పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.