వీడియో మార్ఫింగ్ : పవన్ పై కేసు నిలబడుతుందా ?


పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఓ వీడియో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని ఎబీన్ ఆంధ్రజ్యోతి కేసు పెట్టింది. ఇందులో ఏబీఎన్ వాదన ఏమిటంటే.. శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన దగ్గర బీప్ శబ్దం వేసి.. వినిపించకుండా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జాగ్రత్తలు తీసుకుందట. ఐతే తన తల్లిని దూషిస్తూ శ్రీరెడ్డి మాట్లాడితే,.. ఆమె దూషణలను యథాతథంగా ప్రసారం చేశారని ఆందోళన వ్యక్తం చేసిన పవన్‌ కల్యాణ్‌.. ఏబీఎన్‌ ఎడిట్‌ చేసిన వీడియోను మార్ఫింగ్‌ చేశారట. శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను యథాతథంగా ఉంచి తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేశారు పవన్. ఈ విషయంలో సీరియస్ అయిన ఆ ఛానల్ పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టింది. ఇదీ జరిగిన కధ.

అయితే ఇలాంటి కేసులు ఎంత వరకూ నిలబడతాయి అన్నది ఇక్కడ ప్రశ్న. ఇదంతా సోషల్ మీడియా వ్యవహారం. అసలు ఈ సోషల్ మీడియా లో వచ్చే పోస్టులకు ప్రచారాలకు ఇండియాలో ఎంత వరకూ చట్టబద్దత ఉన్నదో తెలియదు. అక్కడెక్కడో దాని సర్వర్ ఉటుంది. ప్రతివోడు ఒక అకౌంట్ తెర్చుకోవచ్చు, నచ్చిన పోస్ట్లు పెట్టుకోవచ్చు. కొంచెం అభ్యంతరంగా వుంటే.. ఆ సైటే వాటిని బ్లాక్ చేస్తుంది. అంతే తప్పితే ఇందులో ఇలాంటి పోస్టులు పెట్టారని, దానిపై చర్యలు తీసుకోవాలని కేసులు పెడితే అవి విచారణకు వచ్చి తీర్పు వచ్చిన కేసు ఒక్కటి కనిపించదు.

అసలు ఈ సోషల్ మీడియానే పెద్ద రచ్చ. మళ్ళీ ఇందులో కేసులు అంటే టైం వేస్ట్ వ్యవహారమే. పైగా వీడియోలు, ఆడియోలు ఆదరంగా ఎలాంటి కేసులు నిలబడవని సుప్రీం కోర్టు ఆదేశాలు వున్నాయి. సో .. ఇవి నిలబడే చాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ విషయానికే వద్దాం… ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. దాన్ని మార్ఫింగ్ అంటున్నారు. ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ కు న్యాయస్థానం అడిగితే ”సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆ వీడియోను నా ట్విట్టర్ లో పోస్ట్ చేశాను” అని చెబుతాడు. అంతే ఇక్కడితో అయిపోయింది. సోషల్ మీడియా వ్యవహారం సోషల్ మీడియాలో కొట్టుకుపోతుంది. అంతకుమించి ఈ కేసులో ఏమీ జరగదని పలువురు అభిప్రాయపడుతున్నారు.