ఈ వారం 5 సినిమాలు రాబోతున్నాయి..

గీత గోవిందం సినిమా వచ్చి రెండు వారాలు దాటినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో హిట్ మూవీ రాకపోయేసరికి అంత ఈ వారం విడుదల అవుతున్న చిన్న సినిమాల ఫై ఆసక్తి పెంచుకున్నారు. గత వారం నాల్గు సినిమాలు విడుదలైనప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ వారం ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి.

వీటిలో ముందుగా ఆగస్టు 30 న నాగ శౌర్య @నర్తనశాల తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్ర ట్రైలర్స్ , వీడియోస్ , ఆడియో బాగుండడం తో ఈ మూవీ ఫై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. నర్తనశాల వచ్చిన తర్వాతి రోజు మిగతా 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో 2 స్ట్రయిట్ సినిమాలుంటే, మిగతా రెండు డబ్బింగ్ సినిమాలు. స్ట్రయిట్ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ సంపత్ నంది నిర్మాణం లో తెరకెక్కిన పేపర్ బాయ్. మహేష్ బాబు , ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఈ సినిమా ట్రయిలర్ చూసి మెచ్చుకోవడంతో పాటు ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ వారు రిలీజ్ చేస్తుండడం తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. మరో సినిమా సమీరమ్..ఫెయిల్యూర్‌ లవ్‌స్టోరీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. యశ్వంత్‌, అమృత ఆచార్య హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. అనిత క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా నిర్మించబడింది. ఈ సినిమా వస్తుందనే విషయమే చాలామందికి తెలీదు. మరి ఈ మూవీ థియేటర్స్ లలో ఎలా సందడి చేస్తుందనేది చూడాలి.

ఇక డబ్బింగ్ సినిమాల చూస్తే నయనతార కోకో కోకిల, క్రైమ్-23. కోలీవుడ్ లో విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్న కొలమావు కోకిల సినిమా కోకో కోకిలగా తెలుగులోకి వస్తోంది. ఈ సినిమా ఆల్రెడీ తమిళంలో హిట్ కావడం తో తెలుగులోనూ హిట్ అవుతుందని అంత భావిస్తున్నారు. ఇక అరుణ్ విజయ్ హీరోగా నటించిన క్రైమ్-23 సినిమా కూడా ఈ వారం విడుదల అవుతుంది. మొత్తం మీద ఈ వారం ఐదు సినిమాలు సందడి చేసేందుకు సిద్ధం అయ్యాయి. మరి వీటిలో ఏది ఫై చేయి సాదిస్తుందనేది చూడాలి.