దీపావళి కి ఆ ముగ్గురు రాబోతున్నారు..

ఈసారి దీపావళి బరిలో తెలుగు సినిమాలేవీ లేకుండా..డబ్బింగ్ సినిమాలు సందడి చేయబోతున్నాయి.. ఇద్దరు టాప్ స్టార్స్ సినిమాలు బరిలోకి రాబోతున్నాయి. విజయ్ నటించిన సర్కార్ , అమీర్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులలో మంచి ఆసక్తే నెలకొని ఉంది. అయితే తెలుగు ప్రేక్షకులను నిరాశ పరచకుండా ముగ్గురు స్టార్ హీరోలు తమ సినిమాల ఫస్ట్ లుక్ లతో రాబోతున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న చిత్ర ఫస్ట్ లుక్ ను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తున్నా ఇంకా ఈ సినిమాకు సంబందించిన టైటిల్ కానీ ఎలాంటి లుక్ లు రాకపోయేసరికి అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఈ ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వెంకటేష్ – వరుణ్ తేజ్ ల కలయికలో అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న ఎఫ్ 2 చిత్ర ఫస్ట్ లుక్ సైతం దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరి తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ సైతం దీపావళి రోజు తన కొత్త సినిమా లుక్ తో రాబోతున్నాడు. ప్రముఖ సినిమా ఫోటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను దీపావళికి రిలీజ్ చేయబోతున్నారు. దీపావళి ముందు రోజు లేదా దీపావళి రోజున ఈ మూడు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లు రిలీజ్ కానున్నాయి.