రాజకీయాలకు సినీ కళ..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి రోజు రోజుకు తారాస్థాయి కి చేరుతుంది..ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో నేతలకు 24 గంటలు సరిపోవడం లేదు..ఇంకో పది గంటలు రోజులో ఉంటె బాగుండు అని అనుకుంటున్నారు. ఇక రాజకీయ స్టార్స్ కు ఇప్పుడు సినీ స్టార్స్ జోడి అయ్యారు. సినీ స్టార్స్ ఎంట్రీ ఇవ్వడం తో రాజకీయ ప్రచారాలకు కొత్త కళ వచ్చినట్లయ్యింది. మరి ఏ ఏ స్టార్స్ ఏ ఏ పార్టీ కి మద్దతు ఇస్తున్నారో చూద్దామా..

ముందుగా జనసేన పార్టీ విషయానికి వస్తే..సినీ ఇండస్ట్రీ లో పవర్ స్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన. ముందు నుండి ఈ పార్టీ లో అధిక మొత్తం లో సినీ స్టార్స్ జాయిన్ అవుతారని అంత అనుకున్నారు కానీ అన్ని పార్టీ లా కన్నా ఈ పార్టీ లోనే సినీ గ్లామర్ తగ్గిందని చెప్పాలి.

జనసేన పార్టీ కి మద్దతుగా పవన్ సోదరుడు నాగబాబు ప్రచారం చేస్తుండగా ‘జబర్దస్త్’ మాజీ టీమ్ లీడర్ షకలక శంకర్, ఆదీలు మద్దతు తెలుపుతున్నారు. వీరు తప్ప మరో సినీ స్టార్స్ లేరు.

ఇక వైసీపీ విషయానికి వస్తే..గతంలో కంటే ఈసారి ఎన్నికల్లో ఎక్కువ శాతం సినీ గ్లామర్ ఫ్యాన్ కే దక్కింది. నెల క్రితం వరకు కేవలం చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు చాల లిస్టే పెరిగింది. సీనియర్ నటి జయసుధతో పాటు బానుచందర్, ఆలీ, పృథ్వీ, కృష్ణుడు, రాజా రవీంద్ర, దాసరి అరుణ్, పోసాని కృష్ణ మురళీలు వైసీపీకి మద్దతు తెలుపుతుండగా… సినీ నిర్మాత విజయవాడ పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) విజయవాడ నుంచి పోటీ చేస్తుండగా, రోజా మరోసారి నగరి స్థానం నుంచే బరిలో దిగుతూ వైసీపీ కి అసలైన సినీ గ్లామర్ తెచ్చారు.

ఇక బీజీపీ విషయానికి వస్తే.. ‘నచ్చావులే’ ఫేమ్, నటి మాధవీలత మొదటిసారి ఎన్నికల్లో బరిలో నిలిచింది. గుంటూరు బీజేపీ పశ్చిమ అభ్యర్థిగా ఈమెకు అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఈమె తో పాటు రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఉన్నప్పటికీ ఆయన గతంలో మాదిరి యాక్టివ్ గా లేరు.

ఇక తెలుగుదేశం పార్టీ దగ్గరికి వస్తే….గతంలో సినీ స్టార్స్ అంత పసుపు పార్టీ కే మద్దతు ఇచ్చేవారు. నందమూరి హీరోలైన..మిగతా నటి నటులైన..చాల మంది టీడీపీ కే మొగ్గు చూపించేవారు కానీ ఈసారి మాత్రం సినీ గ్లామర్ టీడీపీ కి బాగా తగ్గింది. బాలకృష్ణ హిందూపురం నుంచి రెండోసారి బరిలోకి దిగుతున్నారు. వాణి విశ్వనాథ్, దివ్యవాణీలకు టికెట్లు దక్కక పోవడం తో వారు కేవలం ప్రచారానికే మిగిలారు. ఈసారి నందమూరి హీరోలు లేని స్పష్టంగా కనిపిస్తుంది.

మొత్తం మీద సినీ గ్లామర్ తోడవడం తో ఎన్నికలకు కొత్త కళ వచ్చినట్లు అయ్యింది.