మనోజ్ వైస్సార్సీపీ నుండి పోటీ చేస్తాడా..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు.. మంచు మనోజ్ ను అతి త్వరలో పొలిటికల్ లీడర్ గా చూడబోతున్నామా అంటే అవుననే చెప్పాలి..హీరోగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్…ఇండస్ట్రీ లో అడుగుపెట్టి చాల కాలమే అవుతున్న బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం ఒక్కటి కూడా కొట్టలేకపోయాడు. ఈయన తర్వాత ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారు , రెండు , మూడు సినిమాలతోనే టాప్ హీరోలుగా చెలామణి అవుతుంటే మనోజ్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. అది కాక ఇటీవల ఈయన నటించిన సినిమాలన్నీ ఒకదానిని మించి మరోటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఈయనతో సినిమాలు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఇక ఈ నేపథ్యంలో సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యినట్లు ఉంది.

అందుకే గతంలోనే ఒకసారి తాను సినిమాలనుంచి తప్పుకుంటున్నా అని సోషల్ మీడియాలో ప్రకటించి, ఆ తర్వాత ‘అభిమానుల కోరిక మేరకు’ దాన్ని ఉపసంహరించుకున్న మనోజ్.. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రకటన చేశాడు. ఆయన ట్విటర్ వేదికగా అభిమానులకు సుదీర్ఘమైన లేఖ రాసాడు. మనోజ్ లేఖ ను చూస్తుంటే మొత్తంగా సినిమాలు వదిలేసి, తిరుపతి నుంచి రాజకీయాలు నడిపేలా అనిపిస్తోంది. మంచు మనోజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో గట్టి అనుబంధం ఉంది. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మంచుమోహన్ బాబు కుటుంబానికి కాస్త ప్రాబల్యం ఉంది. దాన్ని వాడుకుంటూ మనోజ్ రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉందని గట్టిగా తెలుస్తుంది. మరి వైస్సార్సీపీ పార్టీ లోకి చేరతాడా..లేక మరేదయినా పార్టీ లో చేరతాడా అనేది చర్చ గా మారింది.