మే అంత సినిమాలే..సినిమాలు

2018 లో తెలుగులో ఇప్పటివరకు చాల సినిమాలే రిలీజ్ అయినప్పటికీ , అసలైన సినిమా పండగను తీసుకొచ్చిన సినిమాలు మాత్రం రంగస్థలం , భరత్ అనే నేను అనే చెప్పాలి. ఈ రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి నడుస్తుంది. ఇక మే నెలలో కూడా ఇదే పండగ వాతావరణం కనిపించబోతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలే కాక లో బడ్జెట్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ముందుగా మే 04 న అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు. ఆ తర్వాత మే 09 న మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి సినిమా రాబోతుంది. అదే వారంలో పూరి డైరెక్ట్ చేసిన ‘మెహబూబా’ చిత్రం మే 11 న వస్తుంది. పూరి తనయుడు ఆకాష్ హీరోగా నటించాడు. ఈ మూవీ ఫై కూడా కాస్త అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇక మే 18న అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ రాబోతుంది. మే చివరి వారంలో రవితేజ – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘నేల టికెట్’, నాగార్జున – వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆఫీసర్’ సినిమాలు మే 25 న వస్తున్నాయి. అలాగే రాజ్ తరుణ్ ‘రాజుగాడు’, విశాల్ సినిమా ‘అభిమన్యుడు’ కూడా మే చివర్లోనే వస్తాయని అంటున్నారు. మొత్తానికి మే మొత్తం సినీ ప్రేమికులకు పండగే అని చెప్పాలి.