మెహ్రీన్ పరువు తీస్తున్నారు..

ఇండస్ట్రీ కి సంబదించిన ఈ చిన్న సంఘటన జరిగిన పెద్దది చేసే టీవీ చానెల్స్..ఇటీవల శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ ను తమ టీఆర్పీ రేటింగ్ ల కోసం బాగా వాడుకున్నారు. దానిపై సినిమా పరిశ్రమ అంత సీరియస్ కావడం , ఒకానొక టైం లో కొన్ని న్యూస్ చానెల్స్ ఫై బ్యాన్ చేయాలనే నిర్ణయం వరకు వెళ్లడం తో ఆ రచ్చను ఆపేసారు.

ఇక అంత సద్దుమణిగింది అనుకునే లోపే మరో షాక్ తగిలింది సినిమా పరిశ్రమకు. తాజాగా షికాగో లో తెలుగు హీరోయిన్లతో సెక్స్ రాకెట్ నడుపుతూ పోలీసులకు అడ్డంగా సినీ నిర్మాత దంపతులు దొరకడం తో మీడియా చానెల్స్ పండగ చేసుకుంటున్నాయి. రోజు దీని ఫై చర్చ జరుపుతూ టీఆర్పీ రేటింగ్ లను పెంచే క్రమంలో ఉన్నారు. ఈ సెక్స్ రాకెట్ లో హీరోయిన్ మెహ్రీన్ పోలీసులు విచారించినట్లు స్వయంగా ఆమెనే తెలిపింది. కేవలం అనుమానంతో ఆమెను అమెరికా పోలీసులు విచారించారు. అందుకే ఈ విషయాన్ని మెహ్రీన్ తనకుతానుగా స్వయంగా బయటపెట్టింది. కానీ తెలుగు మీడియా మాత్రం మెహ్రీన్ ను ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నట్లు చూపిస్తూ ఆమె పరువు తీస్తున్నారు.

Also Read :   నాల్గు వసంతాల తెలంగాణ...

కొన్ని ప్రముఖ ఛానెళ్లు నిన్నంతా చర్చలు జరిపి పండగా చేసుకున్నారు. చర్చ లో కూర్చున్న పలువురు తమకు తాముగా ఉచిత సలహాలు ఇస్తూ పోయారు. గంటల పాటు సాగిన ఈ చర్చావేదికల్లో మెహ్రీన్ ఫొటోల్ని, ఆమె నటించిన సినిమా క్లిప్పింగ్స్ ను విచ్చలవిడిగా వాడేశాయి. ఈ సెక్స్ రాకెట్ ను మూలా కర్తయిన కిషన్ మోదుగుమూడి ఫొటో తో మెహ్రీన్ స్టిల్స్, క్లిప్స్ ను కూడా జోడించి ప్రచారం చేసాయి. ఈ చర్చ చూస్తే ఎవరికైనా మెహరీన్ కూడా సెక్స్ రాకెట్ లో దొరికిందా..ఈమె కూడా ఈ వ్యవహారం లో ఉందా అనే అనుమానాలు రాకమానవు. అంతలా మెహ్రిన్ పరువు తీశారు. ప్రస్తుతం మెహ్రీన్ అమెరికాలో తన తల్లిదండ్రులతో ఉంది.

Also Read :   టాలీవుడ్ నయా మల్టీస్టారర్ ట్రెండ్ : చిన్నోడు పెద్దోడు