ఒకవేళ బాబు తో పవన్ కలిస్తే నాగబాబు పరిస్థితి ఏంటి…?

వెండితెర ఫై పెద్దగా సక్సెస్ కాలేకపోయినా మెగా బ్రదర్ నాగబాబు..నిర్మాతగా కూడా సక్సెస్ కాలేకపోయాడు. ఈ సంగతి అందరికి తెలిసిందే. గత కొన్నేళ్లుగా జబర్దస్త్ షో ను నమ్ముకొని నెట్టుకొస్తున్నాడు. ఈ మధ్య ఎక్కువగా తన ఫోకస్ ను యూట్యూబ్ ఫై పెట్టాడు..నా ఛానల్ నా ఇష్టం అంటూ తనకు తానే ఓ ఛానల్ ఏర్పటు చేసుకొని అందులో రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తూ ఆనందపడుతున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారపార్టీ గా ఉన్న తెలుగుదేశం ఫై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తూ వస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు..లోకేష్ లపై గట్టిగానే వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. ఇదంతా ఎందుకోసం అంటే తన తమ్ముడి జనసేన కోసమే అని నాగబాబు చెప్పక పోయిన అందరికి అర్ధమవుతుంది.

గత ఎన్నికల్లో అదే తమ్ముడు టీడీపీ కి సపోర్ట్ చేసి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు సాయం చేసాడు. నాలుగేళ్లు చంద్రబాబు, లోకేష్ లతో మంచిగా ఉండి, ఆ తర్వాత బయటకు వచ్చి, వాళ్ల మీద అవినీతి ఆరోపణలు చేసాడు. మొన్నటి వరకు అలాగే చేసాడు. ప్రస్తుతం మాత్రం సైలెంట్ అయ్యాడు. మాములుగా అయితే ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో ఇంకా రెచ్చిపోవాలి కానీ పవన్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీకి తనకు మధ్య ఒప్పందం కుదిరిపోయిందని, అందుకే సైలంట్ అయిపోయారని చాలామంది మాట్లాడుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కు లేని బాధ నాగబాబుకు ఎందుకు అని అంత మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ వెళ్లి, టీడీపీతో కలిస్తే..ఎన్నికల్లో మళ్లీ టీడీపీ తో దోస్తీ కట్టి ప్రచారం చేస్తే నాగబాబు పరిస్థితి ఏమిటి? ఎన్ని రోజులు పెట్టిన వీడియోల సంగతి ఏంటి..? తెలుగుదేశం పార్టీ ఫై ఎలాగైతే వీడియోలు పెట్టాడో జనసేన ఫై అలాంటి వీడియోలు పెడతారా..? లేక జగన్ వీడియోలు పెడతాడా..? అని అంత మాట్లాడుకుంటున్నారు.