మహేష్, నరేష్ జాతకాన్ని మార్చుతాడా ?


అల్లరి నరేష్ మినిమం గ్యారెంటీ హీరో. ప్రేక్ష‌కుల్ని కితకితలు పెడతాడు. అటు నిర్మాతల్నీ సంతృప్తి పరుస్తాడు. న‌రేష్ సినిమా అంటే థియేట‌ర్లు కిట‌కిట‌లాడుతాయి. సినిమా ఎలా ఉన్నా.. కామెడీ ఉంటుందన్న ఆశ‌తో జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళ్తారు. అయితే.. ఇదంతా న‌రేష్‌ గ‌త వైభ‌వ‌మే. ఇప్పుడు నరేష్ కి హిట్టు లేదు. గ‌త కొన్నేళ్లుగా ఒక్క‌టంటే ఒక్క హిట్టూ లేదు. క‌నీసం యావరేజ్ కూడా లేదు. నరేష్ సినిమా అంటే లైట్ తీసుకోనే పరిస్థితి వచ్చింది. అటు నిర్మాత‌ల‌కూ నరేష్ సినిమాలు చేదు అనుభవాన్ని మిగులుస్తున్నాయి.

మొన్న వచ్చిన.. ‘సెల్ఫీ రాజా , మేడమీద అబ్బాయి, సిల్లీ ఫెలోస్ చిత్రాలు కూడా నిరాశ పరిచాయి. క‌థ‌ల ఎంపిక‌లో న‌రేష్ చేస్తున్న త‌ప్పుల్ని ఈ సినిమాలు మ‌రోసారి ఎత్తి చూపాయి. న‌రేష్ బ‌లం.. వినోదం. న‌రేష్ సినిమాకెళ్లేదే కాసేపు న‌వ్వుకొందామ‌ని. ఆ న‌వ్వుల విష‌యాన్నీ న‌రేష్ కామెడీగా తీసుకొన్న‌ట్టు అనిపిస్తుంది ఆ సినిమాలు చూస్తుంటే.

Also Read :   తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ సమస్య...

నరేష్ సినిమా అంటే కామెడి కోసం జనాలు వస్తారు. ఆయన క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అలాంటిందే. అయితే నరేష్ మాత్రం ఎదో డిఫరెంట్ గా ట్రై చేయాలని చూస్తున్నాడు. ఇది తప్పుకాదు. కాక‌పోతే.. త‌న బాడీలాంగ్వేజ్‌ని దృష్టిలో ఉంచుకొని క‌థ‌ల్ని ఎంచుకోవాల్సి అవసరం వుంది. ఇప్పుడు నరేష్ సినిమాలలో అదే తప్పుతుంది. దింతో నరేష్ మ్యాజిక్ వర్క్ అవుట్ కావడం లేదు.

న‌రేష్ ఎక్కువ‌గా స్నూఫ్‌ల‌పై ఆధార‌ప‌డతాడు. ఇది వ‌ర‌కు ఈ విష‌యంలో న‌రేష్‌కి పెద్ద పోటీ ఉండేది కాదు. అయితే ఇప్పుడు అవే నరేష్ కొంప ముంచుతున్నాయి. అవి చేయ‌డానికి ఇప్పుడు సంపూర్నేష్ బాబు, స‌ప్త‌గిరి, ఫృద్వీ లాంటివాళ్లు త‌యార‌య్యారు. వీళ్ళ ట్రాకులు ఒక రేంజ్ లో పేలుతున్నాయి. ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అవే స్నూఫ్‌ లపై నరేష్ చేస్తున్నసరికి మొనాటనీ వచ్చేసింది. దింతో ఇప్పుడు నరేష్ తప్పకుండా కొత్త దారి వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Also Read :   'లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ పై అంచనాలు పెంచిన మహా నాయకుడు

ఐతే ఇప్పుడు ఒక సినిమాపై చాలా అంచనాలు, ఆశలు పెట్టుకున్నాడు నరేష్. అదే మహేష్ బాబు మహర్షి. ఈ సినిమాలో నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత నరేష్ చేస్తున్న క్యారెక్టర్ రోల్ ఇది. గతంలో గమ్యం సినిమా చేశాడు నరేష్. శర్వానంద్ తో స్క్రీన్ పంచుకున్నాడు. ఈ సినిమా అతని మంచి పేరు తీసుకొచ్చింది. గాలి శీను పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మహేష్ తో చేస్తున్న మహర్షి సినిమాలో పాత్ర కూడా అదే స్థాయి గుర్తింపు తీసుకొస్తుందని భావిస్తున్నాడు నరేష్. మరి నరేష్ ఆశలు నెరవేరాలని కోరుకుందాం.

Loading...