ఎన్టీఆర్.. అభిమానుల ఆకలి తీరుస్తాడా…?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చాల రోజులు అవుతుంది. రంగస్థలం తర్వాత ఆ రేంజ్ హిట్ మరోటి రాలేదు. చిన్న , పెద్ద సినిమాలు బాగానే వచ్చినప్పటికీ ప్రేక్షకులను పూర్తి గా సంతృప్తి పరచలేకపోయాయి. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం మాత్రమే ప్రేక్షకులకు కాస్త రిలాక్స్ చేసింది. ఇక చాల రోజుల తర్వాత భారీ అంచనాల మధ్య రాబోతున్న చిత్రం అరవింద సమేత.

మొదటి సారి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబో లో పవర్ ఫుల్ యాక్షన్ & ఎమోషనల్ చిత్రం గా తెరకెక్కడంతో ఈ సినిమా ఫై యావత్ సినీ ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొని ఉన్నాయి. అక్టోబర్ 11 న విడుదల అవుతున్న దృష్ట్యా ఓపెనింగ్స్ విషయంలో ఎన్టీఆర్ తన సత్తా చాటుతాడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొదటి ఆటకు బాగుంది అని టాక్ వస్తే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామినే అని గట్టిగా చెపుతున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ సహా కీలక నగరాల్లో ఆన్ లైన్ బుకింగ్ ఓపెన్ అయి ఆదివారం దాకా దాదాపు అన్ని ఫుల్స్ కావడం చూస్తేనే అర్ధం అవుతుంది అభిమానులు ఎంతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారో. ఇక దసరా సెలవులు సైతం మొదలు కావడం తో థియేటర్స్ దగ్గర సందడి మొదలు కానుంది.

మరోపక్క ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రోజుకు రెండు అదనపు షోలకు అనుమతి ఇవ్వడం చిత్రానికి మరింత ప్లస్ కానుంది. ఇన్ని అనుకూలాంశాలు అరవింద కు ఉండడం తో ఓపెనింగ్స్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమనిపిస్తుది. మరి ఎన్టీఆర్ – త్రివిక్రమ్ లు ప్రేక్షకులకు ఫుల్ మిల్స్ పెడతారో..లేదో చూడాలి.