మరో నెల రోజుల్లో పవన్ పొలిటికల్ రుచి చూడబోతున్నారా..?

అంటే అవుననే అంటున్నారు ఆంధ్ర ప్రజలు..సినిమాల్లో రాణించినట్లు రాజకీయాల్లో రాణిద్దాం అనుకోని పవన్ రాజకీయాల్లో అడుగుపెట్టాడు కానీ రాజకీయాల్లోకి దిగితే కానీ ఆ లోతు తెలియలేదు. ఏదో చేద్దాం..సినిమా ఇండస్ట్రీ మొత్తం నా వైపే ఉంది..మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది..ఇక అభిమానులు ఉన్నారు..ఇంకేం కావాలి సీఎం కావడానికి అని ఏదో పగటి కలలు కన్నాడు. కానీ పోలింగ్ సమయం వచ్చేసరికి రాజకీయం అంటే ఎలా ఉంటుందో అర్ధం అయ్యింది. అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్ధం కావడం లేదు.

మొన్నటి వరకు అభిమానులంతా సీఎం సీఎం అంటే తెగ సంబరపడిన పవన్ ఇప్పుడు ఆలా అంటే చిరాకు పడుతున్నాడు. ‘మీరు పవన్ కళ్యాణ్ సిఎమ్.. సిఎమ్ అని అరవండి. అక్కడ చంద్రబాబు పథకాల పేరుతో ప్రజల డబ్బు పంచేస్తున్నారు. పదేసి వేలు పదేసి వేలు అంటూ, జగన్ వాళ్లు రెండేసి వేలు పంచేస్తున్నారు. ఇంక ఏం సిఎమ్. మీరు మాత్రం పవన్ కళ్యాణ్ సిఎమ్, సిఎమ్ అని అరుస్తుంటారు. అరవడం కాదు. ఓట్లు వేయాలి కదా? అంటూ’ చిరాకు పడుతున్నాడు.

ఇక రేపు ఒక్కరోజైతే ప్రజలు తమ నిర్ణయం ఏంటో..ఎవరికీ ఓటు వేయాలనుకుంటున్నారా..ఎవర్ని సీఎం చేయాలనుకుంటున్నారో తమ ఓటు ద్వారా తేల్చబోతున్నారు. వారి నిర్ణయం బట్టి పవన్ అసలైన పొలిటికల్ రుచి చూడబోతారని అంత అంటున్నారు.