రిస్క్ లో పూరి..?

తెలుగు లో డాషింగ్ డైరెక్టర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు పూరి జగన్నాథ్. కెరియర్ మొదట్లో వరుస బ్లాక్ బస్టర్స్ తో ఎంతమంది హీరోలను ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా చేసిన ఘనత ను సంపాదించుకున్నాడు.పవన్ కళ్యాణ్ , రవితేజ , రామ్ చరణ్, మహేష్ బాబు వంటి టాప్ హీరోలకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరి , ఆ తర్వాత ఒకే కథలను హీరోలను మారుస్తూ చేయడం తో పూరి మార్క్ తగ్గుతూ వచ్చింది. గత నాలుగేళ్లలో పూరి నుండి వచ్చిన ఒక్క సినిమాకు హిట్ కాకపోవడం తో ఆయన మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఒకప్పుడు పూరి మార్క్ చూసి రైట్స్ కొన్న బయ్యర్లు..ఇప్పుడు ఆయన పేరు వింటేనే పారిపోతున్నారు. అంతలా ఆయన స్థాయి పడిపోయింది.

వర్మ తర్వాత అంత డిజాస్టర్ల ఘనత పూరికే దక్కుతుందని అంత మాట్లాడుకుంటున్నారు. ఆఖరకు ఆయన కొడుకు తో చేసిన సినిమా కూడా భారీ డిజాస్టర్ కావడం తో పూరి తో సినిమాలు చేసేందుకు ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు. కొత్త నటి నటులతో సినిమా అన్నగానీ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం పూరి ఏదో ఒక మాయ చేసి మళ్లీ ఇండస్ట్రీ షేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే కానీ మళ్లీ పూరి బిజీ కాలేడు. మరి పూరి లో అంత దమ్ము ఉందా..అనేది చూడాలి.