సంక్రాంతి బరిలో ఎవరు సత్తా చాటుతారో..?

2020 సంక్రాంతి సినిమా జోష్ మాములుగా లేదు..ఓ సినిమా వస్తేనే సినీ ప్రేక్షకులు పండగా చేసుకుంటారు..అలాంటిది ఈసారి ఏకంగా నాల్గు పెద్ద సినిమాలు వస్తున్నాయంటే వారి ఆనందం మాములుగా లేదు. ముందుగా దర్బార్ తో సంక్రాంతి సందడి మొదలు పెడుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్. మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తమిళ్, తెలుగు , కన్నడ , హిందీ భాషల్లో భారీ ఎత్తున జనవరి 09 న రిలీజ్ కాబోతుంది. అలాగే చాలాకాలం తరువాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండడం నయనతార హీరోయిన్ గా చేయడం తో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా ఫై అంచనాలు భారీ గానే ఉన్నాయి.

ఇక ఈ మూవీ తర్వాత జనవరి 11 న మహేష్ సరిలేరు నీకెవ్వరూ అంటూ సందడి చేయబోతున్నాడు. పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 చిత్రాల సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమా కు డైరెక్ట్ చేయడం..కామెడీ , లవ్ , యాక్షన్ ఇలా అన్ని ఈ మూవీ లో ఉన్నట్లు ట్రైలర్ లో చూపించడం తో ఈ సినిమా ఫై ఇంకాస్త అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక జనవరి 12 న అల వైకుంఠపురం లో అంటూ అల్లు అర్జున్ వస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో రాబోతున్న బన్నీ మూడో చిత్రం ఇది . థమన్ అందించిన మ్యూజిక్ రికార్డ్స్ బ్రేక్ చేయడం తో సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడి ఇంకాస్త అంచనాలు పెరిగాయి.

ఇక లాస్ట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా అంటూ జనవరి 15 న వస్తున్నాడు. ‘శతమానం భవతి’ చిత్రంతో చక్కటి కుటుంబ కథ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన వేగేశ్న సతీష్..ఈ చిత్రానికి డైరెక్ట్ చేయడం తో ఫ్యామిలీ ఆడియన్స్ లలో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా మహేష్ , బన్నీ లను తట్టుకొని ఎలా నిలబడుతుందో చూడాలి. ఓవరాల్ గా ఈ నాల్గు సినిమాల్లో సంక్రాంతి విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి.