అరవింద్ చేతిలో వారిద్దరి జాతకాలు…

టాలీవుడ్ లో మెగా ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కు మంచి గుర్తింపు ఉంది. వరుస పెట్టి సినిమాలు చేయకపోయినా ఆయనకంటూ ఓ గౌరవం ఉంది. అందుకే ఆయన్ను చాలామంది ఫాలో అవుతారు. ఇప్పుడు ఆయన చేతిలో ఇద్దరు డైరెక్టర్ల జాతకాలు ఉన్నట్లు తెలుస్తుంది. వారే శ్రీకాంత్ అడ్డాల , బొమ్మరిలు భాస్కర్.

కొత్తబంగారులోకం , సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు వంటి బ్లాక్ బస్టర్ విజయాలను చవిచూసిన అడ్డాల..ఆ తర్వాత రెండు భారీ డిజాస్టర్లు రావడం తో ఈయనతో సినిమాలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఈ టైములో గీత ఆర్ట్స్ లో అవకాశం ఇచ్చారు అరవింద్. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రెండేళ్లుగా ఓ కథ ను సిద్ధం చేసాడట. తాజాగా అల్లు అరవింద్ కు ఆ స్టోరీ కూడా చెప్పాడట. అరవింద్ చెప్పిన మార్పులుచేర్పులు కూడా పూర్తయ్యాయి. కానీ ప్రాజెక్టుపై మాత్రం అరవింద్ ఇంకా ఓకే చెప్పలేదట. వాస్తవానికి ఈ ప్రాజెక్టులో చాన్నాళ్ల కిందటే శర్వానంద్ పేరు వినిపించింది. అల్లు అరవింద దగ్గర శర్వానంద్ డేట్స్ ఉన్నాయి. కానీ అప్పట్లో అనుకున్న కథ వేరు. ఇప్పుడు అడ్డాల రాసుకున్న కథ వేరు. ఈసారి శర్వానంద్ తో పాటు మరో హీరో కూడా కావాలి. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆలా ఉండిపోయిందట.

Also Read :   ఎన్టీఆర్ కోసం క్రిష్ పడుతున్న కష్టం చూడండి..

ఇక భాస్కర్ విషయానికి వస్తే..బొమ్మరిల్లు టైపు లోనే ఓ కథ సిద్ధం చేసాడట. కానీ ప్రస్తుతం ప్రేక్షకులకు బొమ్మరిల్లు కాదు ఓ ఆర్ ఎక్స్ 100 , అర్జున్ రెడ్డి లాంటి కథలను ఇష్టపడుతున్నారు. అందుకే భాస్కర్ కథను పక్కకు పెట్టి వేరే కథ సిద్ధం చేయమని చెప్పాడట అరవింద్. దీంతో మరో కథ ఫై భాస్కర్ కసరత్తులు చేస్తున్నాడట. ఇలా ఈ ఇద్దరు అరవింద్ దగ్గర రెండేళ్లుగా నలిగిపోతున్నారు. మరి వీరి జాతకాన్ని అరవింద్ ఎప్పుడు మారుస్తాడో చూడాలి.

Also Read :   ఈ పెద్ద సినిమాల్లో ఏది పెద్ద విజయం సాధిస్తుందో..?