ప్రకటనలకు టీడీపీ కోట్ల ఖర్చు..ఇది ప్రజల సొమ్మా..? లేక పార్టీ ఫండా..?

నాడు రాజుల సొమ్ము రాళ్ల పాలు అయినట్లు..నేడు ప్రజల సొమ్ము ప్రకటనల పాలు అవుతుందని తెలుగుదేశం పార్టీ ప్రకటనలు చూసి జనాలు మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు అనేకమంది రాజులు జనోద్ధరణకన్నా కూడా తమ కీర్తి ప్రతిష్టల పైనే మక్కువ ఎక్కువ. అందుకోసం, తమ (వంశ) పాలనకు గుర్తుగా గుళ్లు-గోపురాలు నిర్మించారు. శిల్పాలు, శిలాశాసనాలు చెక్కించారు. గుట్టలను తొలగించి .. కోటలుగా మలిచారు. సొమ్మంతా కరగదీశారు.

ఇప్పుడు పాలకులు వచ్చారు. సేమ్.. వీరికి కూడా, ప్రజాభ్యుదయానికన్నా కూడా తమ వ్యక్తిగత-పార్టీ పైనే ఎక్కువ శ్రద్ధ. ఇందుకోసం, ప్రభావశీల శక్తులైన పత్రికలు-ప్రసార మాధ్యమాలను చెప్పుచేతల్లో ఉంచుకునేందుకుగాను వాటికి ప్రకటనల రూపంలో కోట్లు గుమ్మరిస్తున్నారు. ప్రజల సొమ్ము ఖాళీ చేస్తున్నారు. ప్రకటనలకు కోట్లు కుమ్మరించడంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు ఉంటారని అందరికి తెల్సిందే.

బాబు ధర్మపోరాట దీక్ష చేసిన, నవ నిర్మాణ దీక్ష చేసిన..బాబు ఏపని చేసిన వీటి ఏర్పాట్ల కోసం భారీగా ఖర్చు పెడుతుంటారు. జనాలను తరలించడం, వాళ్ల కోసం భోజనాలు.. అవన్నీ గాక.. పత్రికలకు యాడ్స్ మరో ఎత్తు. ఈ రోజుల్లో వార్తా పత్రికల్లో యాడ్స్ అంత చిన్న విషయం ఏమీ కాదు. ప్రింట్ ఖరీదు అయిపోవడంతో.. పత్రికలకు యాడ్స్ మాత్రమే రెవెన్యూ కావడంతో.. అవి యాడ్ రేట్ ను భారీగా పెంచేశాయి. అయినాగానీ బాబు ఏమాత్రం తగ్గడం లేదు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం రావడం తో బాబు ప్రకటనలు మాములుగా లేవు..24 గంటలు ఏ ఛానల్ చూసిన బాబు ప్రకటనే కనిపిస్తుంది. బాబు సంక్షేమ పథకాలు..రుణమాఫీ ..డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు..24 గంటలు కరెంట్..ఫ్రీ ఇల్లు..రోడ్లు ఇలా ఒకటేటి అన్నింటి మీద ప్రకటనలు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. మొన్నటి వరకు లలిత జ్యువలరీ ప్రకటన వచ్చేది..ఇప్పుడు దానిని మించిపోయారు బాబు..

బాబు చేసే హడావిడి చూసి జనాలు మరో విధంగా మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ చేసే కోట్లా ఖర్చు.. ప్రజల సొమ్మా..? లేక పార్టీ ఫండా..? అని..ఒకవేళ ప్రజల సొమ్మే అయితే ఆలా ఖర్చు చేయడం ఎంత వరకు కరెక్ట్..? అని కొంతమంది అంటుంటే..మోసపూరిత ప్రకటనలు చేస్తూ బాబు ఎంత మోసం చేస్తున్నాడో కదా..? మాయమాటలు చెప్పే బాబు కు ఓట్ వేయాలా..ఎలాంటి మాయ మాటలు చెప్పకుండా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అనే జగన్ కు ఓట్ వేయాలా అని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు.