నాల్గు వసంతాల తెలంగాణ…

తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి . ప్రతి పల్లెల్లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకుంటూ కేసీఆర్ కు వందనాలు చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తది..? అని అన్నవారికి తెలంగాణ వస్తే ఇంత మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించాడు.

* వృద్ధులు, వితంతు, ఒంటరి, దివ్యాంగులు, బోధకాలు బాధితులు, వృద్ధ కళాకారులు, బీడీకార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం.

* ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి ఇంట్లో ఆడపిల్ల వివాహానికి ఆర్థిక సహాయం ఇచ్చేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరుతో పధకం.

* విద్యార్థులకు సన్నబియ్యం..

* రైతుబంధు పేరిట ప్రతీ పంటకు ఎకరానికి రూ.4వేల చొప్పున ఏడాదికి రెండు పంటలకు రూ.8 వేలను రైతులకు నేరుగా అందించేందుకు కేసీఆర్ సర్కారు అంకురార్పణ చేసింది.

* రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ..

* తెలంగాణలోని ఏడు జిల్లాల పరిధిలోని కోటిన్నర ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చేందుకు డిండి, సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి.. ఇలా పదుల సంఖ్యలో ప్రాజెక్టులు.

* 24 గంటల విద్యుత్ సరఫరా

* మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయ

* కేసీఆర్ కిట్..

* టీఎస్ ఐపాస్ పేరుతో ప్రభుత్వం అమలుచేసిన నూతన పారిశ్రామిక విధానం

ఇలా ఒకటి రెండో కాదు ఎన్నో పధకాలను తీసుకొచ్చి దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా కేసీఆర్ తెలంగాణ ను అభివృద్ధి పదంలో నడుపుతున్నారు.