తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ సమస్య…

థియేటర్స్ సమస్య మరోసారి నిర్మాతలను ఇబ్బందుల్లోకి నెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్స్ నైజాం ఏరియాలో ఉన్న సంగతి తెలిసిందే. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు వస్తే థియేటర్స్ సమస్య స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి సంక్రాంతి బరిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు తెలుగు సినిమాలు వస్తుండగా , రజనీకాంత్ పెటా చిత్రం సైతం సంక్రాంతి బరిలోనే వస్తుండడం తో థియేటర్స్ ఇబ్బంది చాల ఎక్కువగా ఉంది.

ఎక్కువ థియేటర్స్ దిల్ రాజు , అల్లు అరవింద్ , యువీ క్రియేషన్స్ చేతుల్లో ఉండడం తో వారంతా వినయ విధేయ రామ , ఎఫ్ 2 చిత్రాలకు కేటాయించారు. ఇక సురేష్ బాబు, ఏషియన్ సునీల్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి కేటాయించారు. దీంతో ఉన్న వరకు థియేటర్స్ అన్ని ఈ మూడు చిత్రాలకు వెళ్లిపోయాయి. పెటా చిత్రానికి థియేటర్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్ర రైట్స్ కొనుగోలు చేసిన అశోక్ ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు. అలాగే అజిత్ నటించిన విశ్వాసం సైతం సంక్రాంతి కానుకగా తమిళనాట విడుదల అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ సమస్య కారణం గా ఈ సినిమాను ఎవరు కొనుగోలు చేయలేదని తెలుస్తుంది. ఒకవేళ థియేటర్స్ ఉంటె ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో వచ్చేది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ సమస్య మరోసారి బయటపడింది.