పవన్ కళ్యాణ్ హార్డ్ వర్క్ మాములుగా లేదు

పవన్ కళ్యాణ్ కి బిజినెస్సులు లేవు. ఆయన ఆదాయ మార్గం సినిమా మాత్రమే. ఐతే రాజకీయాల్లోకి వాటికి కూడా కొంతకాలం దూరమయ్యారు ఇప్పుడు మళ్ళీ సెట్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన వరుస షూటింగ్ లో పాల్గొంటున్నారు.  ఒకప్పటితో పోలిస్తే పవన్ రాజకీయాల్లో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. తరచుగా పర్యటనలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

 మరోవైపు సినిమాల కోసం కూడా బాగానే సమయం కేటాయిస్తున్నారు. తన కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా పవన్ సినిమాల కోసం కష్టపడుతున్నారు పవన్. గతంలో ఆయన లో కొంచెం అలసత్వం చుపించేవారు. ఆయన తెరంగేట్రం చేసి పాతికేళ్లు అవుతుంటే.. ఇప్పటిదాకా చేసిన సినిమాలు పాతిక మాత్రమే. అంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన ఎంత లేటుగా సినిమాలు చేస్తారో.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటు రాజకీయంగా బలపడాలన్నా ఆర్ధికంగా బావుండాలి. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిమిషం తీరిక లేకుండా గడుపుతున్నారు.