రాసలీలల మంత్రి: ‘సెక్స్ ఫర్ జాబ్’

కన్నడ రాజకీయాలు రాసలీలలకు పెట్టింది పేరు. అసెంబ్లీలో స‌మావేశాలు జ‌రుగుతుండ‌గానే బ్లూ ఫిల్మ్ లు చూసిన రాజ‌కీయ నేత‌లున్న రాష్ట్రమ‌ది. ఇప్పుడు మరో సంచలనం.  కర్ణాటక ఇరిగేషన్‌ మంత్రి   రమేష్‌‌ జర్కిహోలి రాసలీలల వీడియో కర్నాటకలో కలకలం రేపుతోంది. సదరు మంత్రి ‘సెక్స్ ఫర్ జాబ్’ మీద ఓ యువతితో చనువుగా ఉన్న వీడియో కన్నడ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.

సదరు యువతి డాక్యుమెంటరీ విషయమై కొన్ని రోజుల కిందట మంత్రి రమేశ్ వద్దకు వచ్చిందని, అయితే సదరు మంత్రి ఆ యువతిని లొంగదీసుకున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా యువతితో మంత్రి ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అవి కాస్తా వైరల్ గా మారి వైరల్ గా మారాయి.  

 ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక యువతిని లోబర్చుకున్నారని పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్‌ కల్లహళ్లి బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, వీటికి సంబంధించి ఆడియోను, వీడియో సీడీని అందజేశారు. బెంగళూరులోని ఆర్‌టీ నగరలో నివాసం ఉండే ఒక యువతి రాష్ట్రంలోని డ్యాంలను డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది. అలా పరిచయమై శారీరక సంబంధం వరకూ వెళ్లిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, తాను ఏ తప్పు చేయలేదు, రాజీనామా చేయాల్సిన పనిలేదని మంత్రి జార్కిహొళి చెప్పుకురావడం కొసమెరుపు.