లవ్ స్టొరీని హైజాక్ చేస్తున్న సాయి పల్లవి

‘ఫిదా’ లో సాయి ప‌ల్లవి టాలెంట్ పూర్తి స్థాయిలో బ‌య‌ట‌ప‌డిపోయింది. ముఖ్యంగా త‌న న‌ట‌న‌.. డాన్స్‌. `వ‌చ్చాడే..` పాటైతే హోరెత్తిపోయింది. అందులో సాయి ప‌ల్లవి చేసిన మూమెంట్స్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ పాట ఇంపాక్ట్ ఆ సినిమాపైచాలా ఉంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల మ‌రో సినిమా చేస్తున్నాడు. అదే `ల‌వ్ స్టోరీ`. సాయి ప‌ల్లవినే హీరోయిన్‌. ఈ సినిమా కోసం ఓ పాట డిజైన్ చేశాడు శేఖర్ క‌మ్ముల‌. `సారంగ ద‌రియా` అంటూ తెలంగాణ స్లాంగ్ లో సాగిన మంచి డాన్సింగ్ బీట్ ఇది. `ఈ పాటలో  సాయి ప‌ల్ల‌వి చేసిన డాన్స్ మూమెంట్స్‌.. ఇవ‌న్నీ క‌లిసి ఈ పాట‌ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాయి. మేకింగ్ వీడియోలోనే.. సాయి ప‌ల్ల‌వి చేసిన కొన్ని డాన్స్ మూమెంట్స్ చూస్తే.. వారెవా అనిపిస్తోంది.

ఐతే ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే .. సాయి పల్లవి పాట హిట్ ఐతే ఏమౌతుందో ఫిదా రుజువుచేసింది. అసలు ఫిదా క్రిడెట్ మొత్తం సాయి పల్లవికే వెళ్ళిపోయింది. ఇప్పుడు లవ్ స్టొరీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది . ఇప్ప‌టి వ‌ర‌కూ ఇది సాయి ప‌ల్లవి సినిమాగానే ప్ర‌మోట్ అవుతూవ‌చ్చింది. ఇప్పుడు లవ్ స్టొరీ కూడా అదే సీన్ కనిపిస్తుంది. ఒకవేళ సినిమా హిట్ ఐతే మాత్రం క్రిడెట్ సాయి పల్లవి ఖాతాలోకి చాలా వరకూ వెళిపోతుంది. కారణం శేఖర్ కమ్ముల సినిమాలు ఎక్కువగా హీరోయిన్ కి ప్రాధాన్యత . ఒకవేళ ఫ్లాఫ్ అయితే మాత్రం చైతు హీరో కాబట్టి ఆయన లిస్టు లోకి వెళ్ళిపోతుందనే అభిప్రాయం వ్యక్తమౌతుంది.