వకీల్ సాబ్ లో హీరోయిజం మాములుగా లేదు

వకీల్ సాబ్ ప్రమోష‌న్ జోరందుకుంది. ఇది వ‌ర‌కు `మ‌గువ మ‌గువ‌` పాట‌ని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. పింక్ సినిమాకి ఇది రీమేక్‌. `పింక్‌` అనేది అమ్మాయి క‌థ‌. దానికి త‌గ్గ‌ట్టుగానే వాళ్ల కోణంలో, వాళ్ల కోసం సాగిన పాట అది.

కానీ ఇది `ప‌వ‌న్‌` సినిమా. త‌న ముద్ర త‌ప్ప‌కుండా ఉండాలి. త‌న ఫ్యాన్స్ ని సంతోష పెట్టే విష‌యాలు పొందుప‌ర‌చాలి. దాన్ని గ‌మనించిన చిత్రబృందం ఈరోజు `స‌త్య‌మేవ జ‌య‌తే` అనే మ‌రో గీతాన్ని విడుద‌ల చేసింది. ఈ పాట‌లో  హీరోయిజం పీక్స్ లో వుంది.

జ‌న‌జ‌న‌జ‌న జ‌న‌గ‌ణ‌మున క‌ల‌గ‌లిసిన జనం మ‌నిషిరా మ‌న‌మ‌న‌మ‌న మ‌న‌త‌ర‌పున నిల‌బ‌డ‌గ‌ల నిజం మ‌నిషిరా నిశి ముసిరిన క‌ల‌ల‌ను త‌న వెలుగుతో గెలిపించు ఘ‌నుడుగా ప‌డి న‌లిగిన బ‌తుకుల కొక బ‌ల‌మ‌గు భుజ‌మివ్వ‌గ‌ల‌డురా… అంటూ మొద‌లైన ఈ పాటలో.. హీరోయిజం  పీక్స్ లో వుంది. ఒకసారి మీరూ వినండి.