ఖుదాబ‌క్ష్ గా మెగా స్టార్


విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్షన్‌లో వస్తున్నా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ మోషన్ పోస్టర్ నిన్న విడుదలైంది. తాజాగా సినిమాలో అమితాబ్‌ బచ్చన్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో అమితాబ్‌ ఖుదాబ‌క్ష్ పాత్రలో కనిపిస్తారు. అమితాబ్‌ బచ్చన్ లుక్‌ను ఆమిర్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఖుదాబ‌క్ష్ పాత్ర‌లో వ‌యోధుకుడి లుక్ అందరిని ఆక‌ట్టుకుంటుంది.

19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో ఇండియా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. 1839లో ఫిలిప్ మీడోస్ టేలర్ రాసిన కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్ అనే నవల స్ఫూర్తితో సినిమాను రూపొందించారు. దేశంలో ఓ దోపిడీదారు, అతని గ్యాంగ్ కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ప్రధాన కథాంశంగా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌ను తెరకెక్కించారు. . థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ 3డీ, ఐమ్యాక్స్ ఫార్మాట్లలో హిందీతోపాటు తమిళ్, తెలుగులలో రిలీజ్ కానుంది.

ఈ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్స్ అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ అలాగే కత్రినా కైఫ్, ఫాతిమా సనషేఖ్, జాకీ ష్రాఫ్ మొదలగు వారు ముఖ్య పాత్ర‌లలో నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 8న విడుదల కానుంది థగ్స్ ఆఫ్ హిందుస్థాన్.