బిగ్ బి ఇంకా ఎన్ని రోజులు హాస్పటల్ లో ఉండాలంటే ..

బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే . ఈయన తో పాటు కుమారుడు , కోడలు , మనవరాలు ఇలా అందరికి వైరస్ సోకింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరు బిగ్ బి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

 అమితాబ్, అభిషేక్ ఆరోగ్యంపై నానావ‌తి ఆస్ప‌త్రి అప్ డేట్ ఇచ్చింది. అమితాబ్‌, అభిషేక్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. చికిత్స కొన‌సాగుతుంది. మ‌రో 7 రోజులు ఆస్ప‌త్రిలో ఉండాల్సి ఉంటుందని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.