మహేష్ కోసం ఆ సినిమా చేశా – బండ్ల గణేష్

రీసెంట్ గా కరోనా బారి నుండి క్షేమంగా బయటపడిన బండ్ల గణేష్..తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సరిలేరు నీకెవ్వరూ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. కమెడియన్ గా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన గణేష్..ఆ తర్వాత నిర్మాతగా మారారు. ఒకటి , రెండు ప్లాప్స్ పడేసరికి సినిమాలకు దూరమయ్యాడు . ఈ మధ్యనే సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ గణేష్ చేసిన పాత్ర కు ప్రశంసలు దక్కగా పోగా అంత తిట్టారని తెలిపాడు గణేష్.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చూసిన తర్వాత నా పిల్లలు నన్ను చివాట్లు పెట్టారు. అలాంటి కేరక్టర్‌ ఎందుకు చేశావు నాన్న. మరోసారి అలాంటివి చేయవద్దని చెప్పారు. నిజం చెప్పాలంటే నాకు కూడా పాత్ర నచ్చకపోయినా మహేష్‌బాబు, దర్శకుడు అనిల్‌ రావిపూడిల కోసం ఆ సినిమా చేశాను. భవిష్యత్‌లో మాత్రం అలాంటి తప్పులు మళ్లీ చేయకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు.