రాజమౌళి ప్లాన్ మారింది..

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ..బాలీవుడ్ భామ అలియా , అజయ్ దేవగన్ తో పాటు కోలీవుడ్ నటుడు సముద్రఖని , హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉంది. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

కరోనా ఉదృతి కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడి నాలుగు నెలలు దాటిపోయింది. అంతకంతకు దేశంలో పెరిగిపోతున్న కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో అర్థం కావడం లేదు. మరోవైపు షూటింగ్ పూర్తి చేయాలన్న టెన్షన్ రాజమౌళిలో పెరిగిపోతుంది. అందుకే ఆయన షూటింగ్ మొదలుపెట్టడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెతుకుతున్నారు.

కాగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విదేశాలలో చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న అక్షయ్ కుమార్ తన లేటెస్ట్ మూవీ బెల్ బాటమ్ షూటింగ్ కొరకు లండన్ వెళ్లారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సైతం విదేశాలలో చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. మరి రాజమౌళి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.