విహారానికి వెళ్లిన నటి… శవమై తేలింది..

సినీ ఇండస్ట్రీ లలో వరుస మరణాలు షాక్ కు గురి చేస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ లలో ఇప్పటికే పలువురు చనిపోగా..తాజాగా హాలీవుడ్ బ్యూటీ విహారానికి వెళ్లి శవమై తేలడం అభిమానులను షాక్ కు గురి చేసింది. హాలీవుడ్ నటి నయా రివీరా క్యాలిఫోర్నియాలోని పెరూ లేక్ లో పడి మృతి చెందింది.  ఐదు రోజుల క్రితం  నటి నయా రివీరా తన కుమారుడితో కలిసి బోట్ ను అద్దెకు తీసుకొని పెరూ లేక్ లో బోటింగ్ కు వెళ్ళింది.   అలా వెళ్లిన ఆమె సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో, బోట్ అద్దెకు ఇచ్చిన వ్యక్తి పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశాడు.  దీంతో పోలీసులు పెరూ లేక్ లో గాలించగా, బోట్ దొరికింది.  

అందులో ఆమె కుమారుడు మాత్రమే ఉన్నాడు.  నటి నయా రివీరా లేకపోవడంతో అనుమానం వచ్చిన  పోలీసులు, నదిని జల్లెడ పట్టారు.  ఐదు రోజుల తరువాత రివీరా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రివీరా ఆత్మహత్య చేసుకుందా లేదంటే ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు