సత్య దేవ్ కు జోడిగా తమన్నా ..

జ్యోతిలక్ష్మి చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సత్యదేవ్..ఆ ఆతర్వాత పలు విభిన్న రోల్స్ లలో నటిస్తూ వస్తున్నాడు . తాజాగా ఇప్పుడు కన్నడ సూపర్ హిట్ రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగు లో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ మూవీ లో సత్యదేవ్ కు జోడిగా తమన్నా నటిస్తుంది.

 నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా  భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ మధ్య వారంలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శక నిర్మాత నాగ శేఖర్ తెలిపారు. అలానే ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.